stock market telugu, day trader telugu, tading panthulu

Every beginner in stock market should avoid these mistakes in trading, day trading mistakes.

ట్రేడింగ్ లో కి INFACT స్టాక్ మార్కెట్ లోకి Enter అయ్యాక మొదటి సంవత్సరంలో చేయకూడని ఆరు తప్పల గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.

మొదటి సంవత్సరం అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మొదటి సంవత్సరంలోనే చాలామంది ఈ తప్పులు చేసి stock market నుండి ఎగ్జిట్ అయ్యిపోతారు కాబట్టి.

1. DON'T INVEST THE MONEY THAT YOU CANNOT EFFORT TO LOOSE.

మీరు పోగొట్టుకుంటే బాధపడతారు అనే డబ్బులు మాత్రం stock market లో పెట్టకండి. లేదండీ మాకు ఏ ఊర్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయో మాకే తెలియదు అన్న వారికి అయితే ఓకే... కానీ కస్టపడి దాచుకున్న సేవింగ్స్ లేదా ఎలాగూ స్టాక్ మార్కెట్లో సంపాదించొచ్చు కదా అని లోన్  తెచ్చి మరీ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వారు మాత్రం అలా చేయకండి. నాకు తెలిసి ఇది అన్నింటిలో కన్నా అతి పెద్ద మరియు కరిదైనా తప్పు అవవచ్చు. మీరు అనుకున్నదే జరిగి ప్రోఫిట్స్ వస్తే సరే కానీ మీ లక్ బాగాలేక మీరు తెచ్చిన మొత్తం డబ్బులు పోతే అంతే సంగతి. మళ్ళీ స్టాక్ మార్కెట్ అన్న పదం వినిపిస్తేనే వణుకు వచ్చేస్తుంది. కాబట్టి చాలా తక్కువ డబ్బు తో మాత్రమే స్టార్ట్ చేయండి.

stock market telugu

మొదటి సంవత్సరం అంటే ప్రాక్టీస్ ఇయర్ అని ఫిక్స్ అయిపోవాలి. ప్రాక్టీసులో మీరు బోలెడు ఎక్స్పరిమెంట్స్ చేయాలి బోలెడు తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులను సరిదిద్దుకుంటూ అందులోంచి నేర్చుకుంటూ మంచి స్ట్రాటజీ లను  ఫిక్స్ అయిపోతారు ఇదే టైంలో. కాబట్టి మీరు చేసే తప్పులు కరీదైనవి అవ్వకూడదు. మొత్తం నేర్చేచేసుకున్నాం ఇక డబ్బులు చేసుకోవడమే అని మీకు అనిపించినప్పుడు మీ ఇష్టం ఇక మీ దగ్గర ఉన్నడబ్బులు పెట్టుకోవచ్చు కానీ,  అప్పటి వరకు ఒక ఇయర్ వరకు పోయినా పర్లేదు అని మీరు comfortable గా ఫీల్ అయిన డబ్బులతో మాత్రమే ట్రేడింగ్  చేసుకోండి. ఆ అమౌంట్ ఎంత అనేది మీరే డిసైడ్ అవ్వండి.

2. LETTING YOUR SPOUSE/ OR FRIENDS 

ఇది కరెక్ట్ గా మీరు అర్థం చేసుకోకపోతే నేను తప్పు చెప్పినట్టే అనిపిస్తోంది. మీ ఫ్రెండ్ సర్కిల్ లో లేదా మీ కుటుంబంలో మీ మీద హక్కు ఉన్నవారికి అంటే పెద్ద వారితో లేదంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి అయినా సరే మీరు stock market ట్రేడింగ్ చేస్తున్నట్టు చెప్పకండి. అవును మీరు చదివింది నిజమే మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టు చెప్పకండి. ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ని సరిగ్గా ఫాలో అవుతారు అంటేనే ఈ దీనిని ఫాలో అవ్వండి.

stock market telugu

ఎందుకు ఇలా అంటే... సపోజ్ మీ అకౌంట్ లో పదివేలు వేసి వచ్చే నెలలో ఈ డబ్బుని డబుల్ చేస్తాను అని అన్నారు మీ ఫ్రెండ్ తో,  కానీ రియాలిటీకి ఆ 10000 కాస్త 2000 అయ్యాయి అనుకోండి నెక్స్ట్ మంత్ మీ ఫ్రెండ్ కి అకౌంట్ లో 20000 చూపెట్టాలి కాబట్టి వేరే వాళ్ళ దగ్గర 18000 అప్పుగా తీసుకొచ్చి ఇదిగో డబుల్ చేశాను అని మీరు తప్పు కాదు అని ఇలా నిరూపించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ ఫ్రెండ్ కి చూపించడానికి మీరు అప్పు చేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం అనేది ఒక నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతూనే ఉంటుంది మీరు అప్పులపాలు అవుతూనే ఉంటారు.

అందుకే మొదటి సంవత్సరం దాటేంత వరకు మీరు ట్రేడింగ్ చేసుకున్నట్టు ఎవరికీ చెప్పకండి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఎవరికీ చెప్పకండి.

3. I KNOW EVERYTHING 

 >   నాకు మొత్తం తెలుసు అనుకోవడం ఇంకొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకేసి నాకే మొత్తం తెలుసు అనుకుంటారు. స్టాక్ మార్కెట్లో అంతెందుకు వేరే ఏ ఫీల్డ్లో అయినా ఒకటి గుర్తుంచుకోవాలి మీ కంటే తోపులు చాలా మంది ఉంటారు. మీకు ఇంత తెలిసి ఉంటే మిగతా వారికి ఇంకెంత తెలిసి ఉంటుంది చెప్పండి. ఇలా ఆలోచించడం వల్ల మీ పొగరు తగ్గుతుంది. 

>    మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోటుగాళ్లు వాళ్లతో నేను పోటీ పడతారు అని మాత్రం అనుకోకండి. పుష్పక విమానంలా ఎంతమంది పోటుగాళ్ళు పుట్టుకొస్తున్న సరే ఇంకొక పోటుగాడికి ప్లేస్ ఉంటుంది ఈ లోకంలో. ఇలా ఆలోచించడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది

మీరు కాన్ఫిడెన్స్ లేకుండా ఉండకూడదు మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా ఉండకూడదు. బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ట్రేడింగ్లో కూడా అంతే నాకే మొత్తం తెలుసు అని అనకూడదు, నాకు ఏమీ తెలియదు అని కూడా అనుకోకూడదు.

మొదటిది మిమ్మల్ని స్టాప్ లాస్ తీసుకోవడానికి ఒప్పిస్తుంది రెండవది మిమ్మల్ని ట్రేడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పిస్తుంది.stock market telugu

4. TAKING TOO MUCH DATA BUT NO PRACTICE 

ఎక్కువ నేర్చుకుంటారు, తెలుసుకుంటారు కానీ ప్రాక్టీస్ చేయరు. నేర్చుకుంటేనే ఏదైనా సాధించగలం ఇది కరెక్టే ఈ సెంటెన్స్ మధ్యలో ఇంకొక పదం కలిపి చెప్తే.. నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా సాధించగలం. చాలామంది ప్రాక్టీస్ చేయడం పక్కన పెట్టేసి నేర్చుకుందాం, నేర్చుకుందాం, నేర్చుకుందాం... అని చెప్పి ఇక దొరికిన వీడియో దొరికినట్టు చూస్తూనే ఉంటారు. ఇకడ నేర్చుకోవడం తప్పుకాదు కానీ నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తేనే కదా సక్సెస్ వచ్చేది మీరేమంటారు?


5. TAKING EVERYTHING PERSONAL


Stock market కి మీ పేరు ఏమి తెలియదు ఫలానా వ్యక్తి BUY  చేసాడు అని చెప్పి, అందరూ SELL చేసి మీకు లాసు వచ్చేలా చేయరు. ప్రతి బిగినర్స్ ఎప్పుడూ అనుకునేది నేను BUY చేసిన వెంటనే పడి పోతుంది మరియు  SELL  చేసిన వెంటనే పైకి వెళ్తుంది అని. నా STOP LOSS  ట్రిగ్గర్ అయ్యి సేమ్ అక్కడినుంచి రివర్స్ అవుతుంది చాలా సార్లు.

ఇంకొంతమంది ఇంకొక్క అడుగు ముందకు వేసి కావాలనే బ్రోకర్ నా ఆర్డర్ ని చూసి ఎక్స్చేంజ్ వాళ్లకు చెపుతున్నాడు.. నాకు లాస్ రావాలని ఇలా చేస్తున్నారని అనుకుంటారు చాలామంది కానీ ఇలా జరగదు. ఇలా చాలా సార్లు జరిగే ఉంటుంది మీకు కూడా. ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, కొంత మంది అనుభవం ఉన్న ట్రేడర్స్ కి మార్కెట్ మూమెంట్స్ తెలుస్తుంటాయి. కాబట్టి వాటికి తగ్గటు మనం కూడా  మన స్ట్రాటజీ లను డిజైన్ చేస్కోవాలి.

6. DONT QUIT (stock market telugu)

ఇకడ రెండు డోంట్ క్విట్ లు. ఒకటి మొదటి ఇయర్లో లాస్ వస్తే మార్కెట్ నుండి ఎగ్జిట్ అవ్వకండి. రెండవది మొదటి ఇయర్ లోనే ఎక్కువ లాభాలు వస్తే... మీ మైన్ ఇన్కమ్ సోర్స్ అయిన  జాబ్ లేదా బిజినెస్ నుండి తొందరపడి ఎగ్జిట్ అవ్వకండి. ఎందుకు ఇలా అంటే మొదట్లోనే లాస్ వస్తే ఒక్కసారి ఆలోచించండి మీకు ఆ లాస్ ఎలా వచ్చింది అని.. ఏం తప్పులు చేస్తే వచ్చింది అని, ఒకసారి బ్రేక్ తీస్కోని ఆ తప్పులను అనలైజ్ చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎంటర్ అవ్వండి. 


రెండవది...ఇక మొదటి ఇయర్ లోనే ప్రాఫిట్ వస్తే ఇక ఊహల లోకంలో తేలిపోయి నెలకే ఇంత వస్తుంది అంటే ఇయర్ కి ఇంకెంత రావాలి.... అని ఇలా లెక్కలు వేసుకొని బోడి ముప్పై వేళా జీతానికి పని చేయాలా అని ఆఫీస్ కి మీరు కూడా వెళ్లకుండా మీ ఫ్రెండ్ తో రిసైన్ లెటర్ పంపే ఆలోచనలు చేయకండి. ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడూ లాభలే రావు , ముందు మురిపించి తరువాత తలకిందులు చేస్తాయి మార్కెట్లు. ఒక five years వరకు ప్రాఫిట్ లో ఉంటే తప్ప ఈ డెసిషన్ తెస్కోకండి. అంతా వరకు ఈ ట్రేడింగ్ ని పార్ట్ టైమ్ లాగానే చూడండి. 

ఇదండీ ఈ ఆర్టికల్ కి మళ్ళీ ఇంకో ఆర్టికల్ లో మళ్ళీ కలుద్దాం.